ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాకెట్ దాడులతో సరిహద్దులు మార్మోగిపోతున్నాయి. ఈ సమయంలో ఘటనా స్థలి నుంచే ఓ వార్తా ఛానెల్ ప్రతినిధి లైవ్ రిపోర్టింగ్ ఇచ్చారు. సమీపంలోని భవనాన్ని తాకినప్పటికీ.. రిపోర్టింగ్ కొనసాగించారు.
యుద్ధభూమిలో ఈ మహిళా జర్నలిస్ట్ సాహసం భళా!
గాజాలో రాకెట్ దాడులు జరుగుతున్న సమయంలో ఓ టీవీ జర్నలిస్ట్.. లైవ్‌లో వార్తలు అందించారు. ఓ రాకెట్ వచ్చిన ఆమెకు దగ్గర్లోని భవంతిని ఢీకొట్టినా... ధైర్యంగా విధులు నిర్వర్తించారు.
గాజా పేలుళ్లను లైవ్ రిపోర్టింగ్ జర్నలిస్ట్
గాజాలోని ఓ భవనంపై ఫైటర్ జెట్లు రెండు బాంబులను విసిరిన ఘటనపై అల్ జజీరా వార్తా సంస్థకు చెందిన జర్నలిస్ట్ యౌమ్నా అల్ సాయెద్ ఛానెల్‌కు వివరాలు అందిస్తున్నారు. ఆ సమయంలోనే భారీ శబ్దాలతో చుట్టుపక్కల పేలుళ్లు సంభవిస్తున్నాయి. గాజాలోని పలు మీడియా సంస్థలు పనిచేసే భవనాలపైనే ఈ దాడులు జరిగాయని సాయెద్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: