రష్యాలో ఓ విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. మాస్కో విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డట్టు సమాచారం.
అత్యవసర ల్యాండింగ్... మంటలు
రష్యాకు చెందిన సూపర్జెట్-100 విమానం మాస్కో నుంచి మర్మేన్స్క్ నగరానికి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్లఅత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్లు. విమానం రన్వే పై దిగిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటం వల్ల దట్టమైన పొగ అలుముకుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
షాట్ సర్క్యూట్ వల్లేవిమానంలో మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.