తెలంగాణ

telangana

ETV Bharat / international

లోయలో పడిన బస్సు- 16 మంది మృతి - ఇరాన్​ బస్సు ప్రమాదం

Iran bus accident
ఇరాన్​ బస్సు ప్రమాదం

By

Published : Sep 2, 2021, 4:52 PM IST

Updated : Sep 2, 2021, 5:05 PM IST

16:49 September 02

లోయలో పడిన బస్సు- 16 మంది మృతి

ఇరాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. కుర్దిష్​ రాష్ట్రంలోని కొర్దెస్తాన్​ ప్రాంతంలో ఓ మినీ బస్సు లోయలోకి(iran bus accident) దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16మంది మరణించారు. 12మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇరాన్​లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దేశంలో ఏటా 17వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్టు అంచనా. సరైన ట్రాఫిక్​ చట్టాలు లేకపోవడం, వాహనాల్లో లోపాలుండటం, అత్యవసర సేవలు సరిగ్గా లేకపోవడం ఈ దుర్భర స్థితికి కారణం.

Last Updated : Sep 2, 2021, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details