తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​ అగ్రగామిగా ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకం '

Azadi ka amrit mahotsav Palestine: భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతూ తమకు స్ఫూర్తిగా నిలుస్తోందని పాలస్తీనా పేర్కొంది. వివిధ రంగాల్లో భారత్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది. పాలస్తీనాలో నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో పాల్గొన్న ఆ దేశ అధికారులు ఈ మేరకు వ్యాఖ్యానించారు.

palestine india relations
azadi ka amrit Palestine india

By

Published : Jan 16, 2022, 12:42 PM IST

Azadi ka amrit mahotsav Palestine: భారతదేశం స్ఫూర్తికి మూలమని పశ్చిమాసియా దేశం పాలస్తీనా పేర్కొంది. ప్రపంచంలో అగ్రదేశంగా ఎదుగుతూ పాలస్తీనా ప్రజలకు మంచి ఉదహరణగా నిలుస్తోందని కొనియాడింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా పాలస్తీనాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మాట్లాడిన ఆ దేశ అధికారులు.. అనేక రంగాల్లో భారత్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

Palestine India Events:

స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో భాగంగా జనవరి 10-15 మధ్య పలు కార్యక్రమాలు నిర్వహించారు. హిందీ దివస్, స్వామి వివేకానంద జయంతి, మకర సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించారు.

స్వచ్ఛత పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా పాఠశాలల విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.

Palestine India Independence celebration

ఈ సందర్భంగా మాట్లాడిన బిటూనియా మేయర్ రిభీ దోలే.. భారత నాయకత్వాన్ని, సుసంపన్నమైన చరిత్రను కొనియాడారు. 'రాజకీయంగా పాలస్తీనాకు భారత్ మద్దతుగా నిలవడమే కాదు.. సుసంపన్నమైన చరిత్ర, గొప్ప నాయకత్వంతో మాకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అహింస ద్వారా స్వాతంత్ర్యం సాధించిన భారత్.. పాలస్తీనా ప్రజలకు గొప్ప ఉదహరణ' అని అన్నారు.

పాలస్తీనా ప్రభుత్వ సహకారంతో ఆ దేశంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తోంది భారత్. గత నవంబర్​లో 'ఇండియన్ కల్చరల్ వీక్' పేరుతో వారం పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టింది.

ఇదీ చదవండి:యువకుడి మెడకు బిగుసుకున్న తాడు- అలాగే లాక్కెల్లిన ఎద్దు..!

ABOUT THE AUTHOR

...view details