తెలంగాణ

telangana

ETV Bharat / international

నౌరోజ్​ వేడుకల్లో వరుస పేలుళ్లు...ఐదుగురు బలి - నౌరోజ్

అఫ్గానిస్థాన్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పర్షియన్ కొత్త ఏడాది 'నౌరోజ్' వేడుకల్లో వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. కాబూల్​లోని షైతే ప్రార్థనా స్థలంలో ​ జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.

ఘటనా స్థలంలో పోలీసులు

By

Published : Mar 22, 2019, 12:16 AM IST

ప్రార్థనా మందిరంలో పేలుళ్లు
అఫ్గానిస్థాన్​లో పర్షియన్ నూతన సంవత్సరాది 'నౌరోజ్' వేడుకలు విషాదంగా మారాయి. కాబూల్​లోని షైతే ప్రార్థనా స్థలంలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఘటనలో ఐదుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. 20 మందికిపైగా గాయపడ్డారు. రిమోట్ సాయంతో మూడు బాంబులను వెనువెంటనే పేల్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

కాబూల్​లోని కార్తి సఖి ప్రార్థనా మందిరం పరిసర ప్రాంతాల్లో షైతే ప్రజలు అధికంగా నివసిస్తారు. ఏటా నౌరోజ్ పర్వదినాన సంప్రదాయంగా వేడుకలు జరుపుకుంటారు. ఆకుపచ్చ రంగు జెండాలను ఎగురవేసి, పూర్వీకులను స్మరించుకుంటారు. ఈ పర్షియన్ పండగను మధ్యప్రాచ్యంలో ఘనంగా చేసుకుంటారు.

వేడుకల్లో ఉగ్రవాదుల కదలికలపై ఇప్పటికే ప్రజలను అఫ్గాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటివరకూ ఘటనపై ఏ ఉగ్రసంస్థ స్పందించలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలు షైతే ముస్లింలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. సున్నీ మిలిటెంట్ సంస్థలు షైతే ముస్లింలను మతవిరోధులుగా భావించటమే ఇందుకు కారణం.

ఇదీ చూడండి:అకిరే పర్వతంపై కుర్దుల నౌరోజ్​ వేడుకలు అదిరే..

ABOUT THE AUTHOR

...view details