రష్యా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఉక్రెయిన్. ఈ దాడుల్లో 50 మంది రష్యన్ సైనికులు మరణించారు. భారీగా వాహనాలను ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో 3 యుద్ధ ట్యాంకులు, ఒక మాస్టా-ఎస్ యుద్ధ ట్యాంకు, 11 సాయుధ వాహనాలను ధ్వంసం చేశాయి ఉక్రెయిన్ దళాలు. దక్షిణ ఫ్రంట్లైన్లో గురువారం ఈ దాడి జరిగిందని.. ఉక్రెయిన్ దక్షిణ ఆపరేషనల్ కమాండ్ తెలిపింది.
రష్యా సైన్యంపై ఉక్రెయిన్ దాడి.. 50 మంది మృతి.. భారీగా వాహనాలు ధ్వంసం - రష్యా వహనాలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్
రష్యా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఉక్రెయిన్. ఈ దాడుల్లో 50 రష్యన్ సైనికులు మరణించారు.
రష్యన్ సైన్యంపై ఉక్రెయిన్ దాడి
ప్రస్తుతం నల్ల సముద్రంలో రష్యా 17 నౌకలతో సిద్దంగా ఉందని చెప్పింది ఉక్రెయిన్. అందులో 16 కాలిబర్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం కలిగిన.. రెండు క్షిపణి వాహక నౌకలు ఉన్నాయని కమాండ్ వెల్లడించింది. ఉక్రెయిన్లోని మానవతా చర్యలు చేపట్టే ప్రాంతాలను, భవనాలను, ఇతర సౌకర్యాలను నాశనం చేసేందుకు సిద్దంగా ఉన్నాయని ఉక్రెయిన్ మీడియా తెలిపింది.
Last Updated : Nov 11, 2022, 9:53 AM IST