Somalia Hotel attack 2022: సోమాలియా రాజధాని మొగాదిషూలోని హయత్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఇస్లామిక్ తీవ్రవాదులు కాల్పులు జరపగా కనీసం 20 మంది మరణించగా, మరో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించాయి భద్రతా బలగాలు.
కాల్పులకు ముందు తీవ్రవాదులు హోటల్ బయట బాంబుదాడులు జరిపారని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికీ కాల్పులు జరుగుతూనే ఉండడం వల్ల పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోటల్లో ఉగ్రవాదుల మారణకాండతో.. క్షతగాత్రులను రక్షించే ప్రయత్నాలు చేశారు. పోలీసుల రాకతో అప్రమత్తమైన తీవ్రవాదులు హోటల్లోని టాప్ ఫ్లోర్‌కు చేరుకున్నారు. అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు. ఈ దాడికి అల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్-షాబాద్ ఇస్లామిక్ మిలిటెంట్స్ బాధ్యత వహించింది. ప్రభుత్వ అధికారులు తరచూ సందర్శించే ప్రదేశాలపై దాడులు జరపాలన్నదే తమ ఉద్దేశమని తెలిపింది. మరోవైపు ఆ దాడిని యూఎస్ ఎంబసీ ఖండించింది.
"మేము హోటల్ లాబీ దగ్గర టీ తాగుతుండగా, మొదటి పేలుడు జరిగి కాల్పుల శబ్దం వినిపించింది. హోటల్లోని రిసెప్షన్ వద్ద మృతదేహాలు పడి ఉండడం వల్ల నేను వెంటనే గ్రౌండ్ ఫ్లోర్‌లోని హోటల్ గదిలోకి వెళ్లి లాక్ చేసుకున్నాను"
-ప్రత్యక్ష సాక్షి అబ్దుల్లా హుస్సేన్