Suicide Blast in Kabul : అఫ్గానిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు విధ్వంసం సృష్టించింది. శుక్రవారం ఉదయం రాజధాని కాబుల్‌లోని ఓ విద్యాసంస్థ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతిచెందారని, 27 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. దాడి జరిగిన ప్రాంతంలో మైనార్టీ హజారా కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా నివసిస్తారని తాలిబన్ ప్రతినిధి ఖలీద్ జర్దాన్ తెలిపారు.
కాబుల్‌లో ఆత్మాహుతి దాడి.. 19 మంది మృతి.. 27 మందికి గాయాలు
11:15 September 30
కాబుల్‌లో ఆత్మాహుతి దాడి.. 19 మంది మృతి.. 27 మందికి గాయాలు
హజారా పరిసర ప్రాంతంలో ఉన్న కాజ్ విద్యాకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి బాంబు ధరించి వెళ్లాడని, అనంతరం విద్యార్థుల మధ్యకు చేరుకుని తనను తాను పేల్చుకున్నాడని ఆఫ్ఘన్ పీస్ వాచ్ అనే ఎన్జీవో ట్విట్టర్లో తెలిపింది. వాజిర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో ఇటీవలే భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో మరణించారు. ఇప్పుడు మరో ఘటన జరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
అఫ్గాన్‌లో అమెరికా తన బలగాలను ఉపసంహరించడం వల్ల తాలిబన్లు పౌర ప్రభుత్వాన్ని కూలదోల్చి.. గతేడాది ఆగస్టులో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలో హజారా కమ్యూనిటీపై వరుస దాడులు జరుగుతున్నాయి. వీటిలో ఐసిస్ హస్తం కూడా ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి :ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి- 23 మంది బలి
చైనాలో తెగిపడుతున్న పెద్ద తలలు.. అవినీతిపరులపై కమ్యూనిస్ట్ పార్టీ వేటు!