తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​కు భారీ మిలిటరీ సహాయం.. 3.75 బిలియన్​ డాలర్లు ప్రకటించిన అమెరికా

ఉక్రెయిన్​కు మరోసారి అగ్రరాజ్యం భారీ సహాయం ప్రకటించింది. ఉక్రెయిన్​తో పాటు యురోపియన్ అలయన్స్​కు అమెరికా 3.75 బిలియన్ డాలర్ల మిలిటరీ సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 7, 2023, 11:37 AM IST

రష్యాతో యుద్ధంలో తలపడుతున్న ఉక్రెయిన్​కు.. అగ్రరాజ్యం అమెరికా 3.75 బిలియన్ డాలర్ల మిలిటరీ సహాయం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం అయినప్పటి నుంచి అమెరికా.. ఉక్రెయిన్​కు​ మిలిటరీ, మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు 24.9 బిలియన్​ డాలర్ల సహాయాన్ని అందించింది.

తాజాగా ప్రకటించిన మిలిటరీ సాయంలో ఆయుధాలు

⦁ 50 బ్రాడ్లీ సాయుధ వాహనాలు

⦁ 500 టీఓడబ్ల్యూ యాంటీ ట్యాంక్​ క్షిపణులు

⦁ 100 ఎమ్​113 సాయుధ వాహనాలు

⦁ 55 ఎమ్​ఆర్​ఏపీ వాహనాలు, 138 హెచ్​ఎమ్ఎమ్​వీ వాహనాలు

⦁ 18 15మిమీ హావిట్జర్లు, 36 105మిమీ టోవ్డ్​ హావిట్జర్లు

⦁ 18 మందుగుండు సామాగ్రి వాహనాలు

⦁ 1200 155మిమీ యాంటీ ఆర్మర్​ మైన్​ వ్యవస్థలు

⦁ 10 వేల మోర్టార్​ రౌండ్లు

⦁ 4000 జూనీ ఎయిర్​క్రాప్ట్​ రాకెట్లు, 200 యాంటీ ఆర్మర్​ రాకెట్లు

⦁ స్నైఫర్​ రైఫిల్స్, మషీన్ గన్స్

⦁ హై మొబిలిటీ రాకెట్​ వ్యవస్థలు

⦁ ఆర్​ఐఎమ్​ క్షిపణులు

⦁ మందుగుండు సామాగ్రి
వీటితో పాటు నైట్​ విజన్​ అద్దాలు, స్పేర్​ పార్టులు తదితర పరికరాలు ఉన్నాయి.

'పుతిన్​ ఊపిరి పీల్చుకో.. అతడి ఆలోచన అదే'
సంప్రదాయ క్రైస్తవులు పాటించే క్రిస్మస్‌ (ఈ నెల 6, 7 తేదీల్లో) నేపథ్యంలో ఉక్రెయిన్‌లో 36 గంటలపాటు కాల్పుల విరమణను పాటిస్తామంటూ ఏకపక్షంగా తాను చేసిన వాగ్దానాన్ని రష్యా ఉల్లంఘించింది. ఆ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే తూర్పు ఉక్రెయిన్‌ నగరం ఖేర్సన్‌పై క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస భవనాలు ధ్వంసమయ్యాయి.

.

బాధితులను కాపాడేందుకు సహాయబృందాలు రంగంలోకి దిగాయి. దీనిపై ఉక్రెయిన్​, అమెరికా అధ్యక్షులు జెలెన్​ స్కీ, బైడెన్​ స్పందించారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వడం ద్వారా రెట్టించిన ఉత్సాహంతో పోరును కొనసాగించాలన్నది రష్యా పాచిక అని జెలెన్ ​స్కీ ఆరోపించారు. డాన్‌బాస్‌లో ముందుకుసాగుతున్న ఉక్రెయిన్‌ సైనికులను నిలువరించాలన్నది వారి ఆలోచన అని పేర్కొన్నారు. ఇక బైడెన్​ స్పందిస్తూ.. ''పుతిన్‌ ఊపిరి పీల్చుకునేందుకే ఈ విరామం ప్రకటించారని నేను భావిస్తున్నాను'' అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details