తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​లోని కీలక నేతపై ఉగ్రదాడికి కుట్ర, రష్యాలో ఐఎస్​ సూసైడ్ బాంబర్ అరెస్ట్ - భారత్​ పై ఇస్లామిక్​ మిలిటెంట్ల దాడి

రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడ్ని అదుపులోకి తీసుకున్నారు. భారత్​లోని ఓ ప్రముఖ నేత లక్ష్యంగా అతడు ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు గుర్తించారు.

Etv Bharat
Russia detains IS suicide bomber plotting terrorist attack in India

By

Published : Aug 22, 2022, 2:05 PM IST

Russia detains IS suicide bomber :రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్-ఎఫ్​ఎస్​బీ అధికారులు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన ఒక ఆత్మాహుతి బాంబర్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆ దేశానికి చెందిన స్పుత్నిక్ వార్తా సంస్థ వెల్లడించింది. భారత్​లోని ప్రముఖ నాయకుడే లక్ష్యంగా ఆ ముష్కరుడు ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నట్లు అధికారులు గుర్తించారని కథనం ప్రచురించింది.

స్పుత్నిక్ కథనం ప్రకారం.. రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతను మధ్య ఆసియా ప్రాంతంలోని దేశానికి చెందినవాడని నిర్ధరించారు. టర్కీలో ఆత్మాహుతి బాంబర్‌గా ఐఎస్ నాయకులలో ఒకడు నియమించారని విచారణ ద్వారా తెలుసుకున్నారు.

1967 నాటి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం మొదటి షెడ్యూల్‌ ప్రకారం ఇస్లామిక్ స్టేట్​ను ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా గుర్తించింది భారత ప్రభుత్వం. తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఐఎస్​ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటోందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. అందుకే అంతర్జాలంపై పటిష్ఠ నిఘాతో ఆ సంస్థ కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సంబంధిత భద్రతా విభాగాలు ప్రయత్నం చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details