Narendra Modi Foreign Visit: ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాలు సన్నిహిత సహకారంతో పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.
పారిస్ చేరుకున్న మోదీ.. ప్రవాస భారతీయుల ఘన స్వాగతం - narendra modi europe tour
Narendra Modi News: మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో భేటీ కానున్నారు.
narendra modi news
భారతదేశ బలమైన భాగస్వాములలో ఫ్రాన్స్ ఒకటి అని.. ఇరు దేశాలు విభిన్న రంగాలలో సహకరించుకుంటున్నాయని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు. పారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రధానిగా ఎన్నికైన అనంతరం నరేంద్ర మోదీకి ఇది ఐదో ఫ్రాన్స్ పర్యటన. అంతకుముందు ఏప్రిల్ 2015, నవంబర్ 2015, జూన్ 2017, ఆగస్టు 2019 పర్యటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మార్చి 2018లో భారత్‌ను సందర్శించారు.
ఇదీ చదవండి:ఆ దేశాల ప్రధానులకు మోదీ విలువైన కానుకలు