ASHA volunteers WHO: భారత్‌లోని పది లక్షలకు పైగా మహిళా ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆదివారం 'గ్లోబల్ హెల్త్ లీడర్' అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ప్రపంచవ్యాప్తంగా అతికొద్దిమందికే ఇస్తారు. ఈ సారి ఆరు సంస్థలు/వ్యక్తులకు ప్రకటించారు. కొవిడ్-19 సమయంలో భారత ఆశావర్కర్ల సేవలు నిరుపమానమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ప్రశంసించారు. గ్రామీణ పేదలకు ఆరోగ్యసేవలను పొందేలా చేయడంలో, వారిని ఆరోగ్యవ్యవస్థతో అనుసంధానం చేయడంలో ఆశా సేవకులు అద్భుతమైన కృషి చేస్తున్నారని అభినందించారు.
ఆశా వర్కర్లకు అరుదైన గౌరవం...సత్కరించిన డబ్ల్యూహెచ్ఓ
ASHA volunteers WHO: భారతీయ మహిళా ఆశా వర్కర్లను డబ్ల్యూహెచ్ఓ సత్కరించింది. పది లక్షల మందికి పైగా మహిళా వలంటీర్లను గ్లోబల్ హెల్త్ లీడర్ అవార్డుతో సత్కరించింది.
WHO ASHA VOLUNTEERS HONOUR
ప్రభుత్వ వైద్య శాఖ సమన్వయంతో ఆశా వర్కర్లు పనిచేస్తుంటారు. కరోనా సమయంలో ఇంటింటికి వెళ్లి బాధితులను గుర్తించేందుకు కృషి చేశారు. దీంతో పాటు, చిన్నారులకు టీకాలు ఇవ్వడం, గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అందించడం, టీబీ- హైపర్టెన్షన్ వంటి వ్యాధులకు చికిత్స ఇవ్వడం, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం వంటి పనులు ఆశా వర్కర్లు చేపడుతుంటారు.
ఇదీ చదవండి: