తెలంగాణ

telangana

ETV Bharat / international

మరోసారి బయటపడిన చైనా-పాక్​ దోస్తీ.. మరింత బలంగా ముందుకు! - చైనా పాక్​ సంబంధాలు

Pakisthan China Relations: సరిహద్దు వివాదాలు, చొరబాట్ల ద్వారా చైనా, పాకిస్థాన్‌ భారత్‌లో తరచూ అస్థిరతకు యత్నిస్తున్న వేళ ఆ రెండు దేశాల మధ్య సైనిక బంధం మరింత బలపడింది. ఇది సవాళ్లతో కూడిన సమయం అని పేర్కొంటూ రక్షణ సహా ఉగ్రవాద నిరోధక సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని చైనా, పాక్‌ నిర్ణయించాయి. త్రివిధ దళాల స్థాయిలో శిక్షణ, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి.

pakisthan china relations
pakisthan china relations

By

Published : Jun 13, 2022, 12:56 PM IST

Pakisthan China Relations: సందు దొరికితే చాలు భారత్‌తో కయ్యానికి సిద్ధపడేందుకు కుట్రలు పన్నుతున్న చైనా, పాకిస్థాన్‌ల మధ్య స్నేహ బంధం మరోసారి బట్టబయలైంది. రెండు దేశాల మధ్య సైనిక బంధం మరింత బలోపేతమైంది. పాకిస్థాన్‌ సైనిక దళాల ప్రధానాధికారి ఖమర్‌ జావెద్‌ బజ్వా నేతృత్వంలో ఆ దేశ త్రివిధ దళాల ప్రతినిధి బృందం.. చైనాలో జూన్‌ 9 నుంచి 12 వరకు పర్యటించింది. చైనా సైనిక, ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి చర్చలు జరిపింది. ఆదివారం బజ్వా, చైనా కేంద్ర సైనిక కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఝాంగ్‌ యౌక్సికా మధ్య కీలక భేటీ జరిగింది.

చైనా, పాక్‌ మధ్య సైనిక బంధాన్ని బలోపేతం చేయడంపై ఇరువురూ చర్చించారు. భారత్‌ పేరు ప్రస్తావించకున్నా ఇది సవాళ్లతో కూడిన సమయం అని పేర్కొంటూ రక్షణ సహా ఉగ్రవాద నిరోధక సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. రెండు దేశాల త్రివిధ దళాల స్థాయిలో శిక్షణ, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం, పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కొనసాగించాలని బజ్వా, యౌక్సికా భేటీలో నిర్ణయించారు.

తమ ప్రాంతంలోని క్లిష్టతరమైన అంశాల పరిష్కారం దిశగా భవిష్యత్తులో పాక్‌తో చైనా సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని చైనా కేంద్ర సైనిక కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ తెలిపారు. పాక్‌-చైనా బంధం విడగొట్టలేనిదని పాకిస్థాన్‌ సైనిక దళాల ప్రధానాధికారి ఖమర్‌ జావెద్‌ బజ్వా తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారినా పాక్‌.. చైనా వెన్నంటే ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల ఫ్రాన్స్‌ నుంచి భారత్‌.. రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేయగా, దీనికి ప్రతిగా పాకిస్థాన్‌కు చైనా.. జే-10 యుద్ధ విమానాలను అందజేసింది. చైనా, పాకిస్థాన్‌ ఆది నుంచి భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తుండగా, తాజాగా ఆ రెండు దేశాల మధ్య సైనిక బంధం బలపడడం కలకలం రేపుతోంది.

ఇవీ చదవండి:మేఘాలయలో భూప్రకంపనలు.. తుర్కియే, టిబెట్​ దేశాల్లోనూ..

తుపాకీ సంస్కృతికి చెక్.. అమెరికా చట్టసభ్యుల మధ్య సయోధ్య!

ABOUT THE AUTHOR

...view details