సామాజిక మాధ్యమాలపై ఆధ్యయనం చేసిన ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయం ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. ముఖ్యంగా వాట్సాప్లో ఎక్కువ సమయం గడిపేవారు ఒంటరితనానికి దూరం అవుతున్నారని ఓ నివేదికలో తెలిపింది ఎడ్జ్ హిల్ విశ్వవిద్యాలయం. మానసికంగా దృఢంగా ఉండేలా వాట్సాప్ ఉపయోగపడుతోందని నివేదించింది.
"వాట్సాప్లో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంతగా వారి స్నేహితులు, బంధువులతో దగ్గరగా ఉన్నట్టు భావిస్తున్నారు. వారి మధ్య బంధాలు మరింత దృఢమవుతున్నాయి. ఈ బంధానికి వారు మరింత ఆకర్షితులవుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఆత్మీయత పెరుగుతోంది. ఇది వారిలో ఆత్మ విశ్వాసానికి, సామాజిక పోటీ తత్వంలో సానుకూల ఫలితాలకు ఉపకరిస్తోంది."