కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు చాలా మంది. కనీసం వారిని కలిసే అవకాశం కూడా లేకుండాపోయింది. లాక్డౌన్ ప్రభావం సామాన్య మానవులకే కాదు బ్రిటన్ యువరాజు పైనా పడింది. లాక్డౌన్ వల్ల తన కుటుంబసభ్యులను ఆప్యాయంగా కౌగలించుకోలేకపోతున్నట్లు ప్రిన్స్ చార్లెస్ తెలిపారు. అలాగే తన తండ్రిని చూసి కొన్ని వారాలు అయినట్లు ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు చార్లెస్. ఈ ముఖాముఖి వర్చువల్ విధానం ద్వారా జరిగింది.
"దురదృష్టవశాత్తూ స్నేహితులకు దూరంగా ఉండటం నిజంగా చాలా బాధాకరం. కానీ కనీసం ఫోన్ ద్వారా అయినా మాట్లాడగలుగుతున్నాం. కానీ రెండు ఒకటి కాదు కదా? ఇష్టమైనవారికి ఆప్యాయంగా హగ్ ఇవ్వాలని ఎవరికి ఉండదు?"