ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి జనవరిలో వైదొలిగిన బ్రిటన్.. ప్రస్తుతం జరుపుతున్న చర్చలను కొనసాగించాలని తీర్మానించింది. శనివారం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లియెన్తో ఫోన్లో సంభాషించారు. సోమవారం మరోసారి ఫోన్లో చర్చించనున్నారు.
"ప్రస్తుతం బ్రిటన్, ఈయూల మధ్య కొనసాగుతున్న చర్చల్లో పురోగతి సాధించాము. చాలా విభాగాల్లో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. కానీ పరిపాలన, మత్స్య సంపద తదితర అంశాల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి."