ఆస్ట్రియా వియన్నా నగరంలోని ఓ ప్రార్థనా మందిరం వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ అధికారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది బృందంగా ఏర్పడి కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. కాల్పులకు తెగబడిన ఓ దుండగుడ్ని పోలీసులు మట్టుబెట్టారు.
ఆస్ట్రియాలో కాల్పులు.. ఇద్దరు మృతి - vienna shooting synagogue
ఆస్ట్రియా వియన్నాలో తుపాకీల మోత మోగింది. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో దాడికి పాల్పడిన దుండగుడు కూడా ఉన్నాడు.
ఆస్ట్రియాలో కాల్పుల కలకలం
అయితే ఇది ఇస్లామిక్ ఉగ్రవాదుల చర్యగా పోలీసులు భావిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ముష్కరుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. భద్రతాబలగాల సెర్చ్ ఆపరేషన్ పూర్తి అయ్యేవరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని కోరారు.
Last Updated : Nov 3, 2020, 6:06 AM IST