ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన తీవ్రవాదానికి వ్యతిరేకంగా లండన్లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ సెంటర్(సీటీఓసీ)ను ఏర్పాటు చేయనుంది యూకే ప్రభుత్వం. ఈ మేరకు పెద్దమొత్తంలో నిధులను కూడా సీటీఓసీకి కేటాయించనున్నట్లు యూకే ఛాన్సెలర్ రిషి సునక్ స్పష్టం చేశారు.
వచ్చే ఏడాదికి గానూ బ్రిటీష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ బిల్లులో అదనంగా నాలుగు వేల కోట్ల రూపాయిలను కేటాయించారు. ఈ మొత్తాన్ని అక్కడి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఖర్చు పెట్టనుంది. దీనితో పాటే సీటీఓసీ నిర్మాణం జరగనుంది. ఇందులో భాగంగా 2023 లోగా మరో 20వేల మంది పోలీసులను నియమించుకోవాలని యోచిస్తోంది.