ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం - ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాదిలోనే ప్రయోగాలు పూర్తి చేసుకొని ప్రజల ముందుకు రానున్నట్లు బ్రిటన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఏడాది చివరిలోనే టీకాకు బ్రిటన్ రెగ్యులేటరీ సంస్థలు ఆమోదం తెలిపే అవకాశముందని టైమ్స్ పత్రిక తన వార్త కథనంలో పేర్కొంది. అయితే అన్ని ప్రక్రియలు ముగించుకుని వ్యాక్సిన్ ప్రజలకు చేరువ కావడానికి మరో ఆరునెలల సమయం పడుతుందని తెలిపింది.
ఆరు నెలల్లో అందుబాటులోకి ఆక్స్‌ఫర్డ్ టీకా!
ఆక్స్‌ఫర్డ్ టీకా ఈ ఏడాదిలోనే ప్రయోగాలు పూర్తి చేసుకుని ప్రజల ముందుకు రానున్నట్లు బ్రిటన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే అన్ని ప్రక్రియలు ముగించుకుని వ్యాక్సిన్ ప్రజలకు చేరువ కావడానికి మరో ఆరు నెలలు సమయం పడుతుందని తెలిపాయి.
మరోవైపు వ్యాక్సిన్‌ను తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులోకి తేవడానికి బ్రిటన్ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రోగనిరోధకత ఆధారంగా బ్రిటన్ సంయుక్త కమిటీ రూపొందించిన ప్రోటోకాల్ మేరకు ఏ వయస్సుల వారికి వ్యాక్సిన్ ఇవ్వాలనే దానిపై మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారీకి ఆర్డర్లు జారీ చేసింది. అన్ని స్థాయిల్లో పనితీరు బాగా ఉందని నిర్ధరించుకున్న తరువాత ఈ డోసులను అవసరం అయిన వారికి ప్రోటోకాల్ అనుగుణంగా సరఫరా చేయనుంది.