కొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు బ్రస్సెల్స్‌తో చర్చలు జరపనున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు జరపాలన్న విజ్ఞప్తిని పార్లమెంట్ రెండోసారి తోసిపుచ్చిన అనంతరం... బోరిస్ ఈ ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం బ్రెగ్జిట్‌ను ఏ మాత్రం ఆలస్యం చేయదని స్పష్టం చేశారు.
ఐదు వారాలపాటు బ్రిటన్ పార్లమెంట్ సస్పెండ్ కానుంది. దీనికి ముందు ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్షాల వైఖరిని జాన్సన్ తప్పుపట్టారు. వచ్చే నెలలో బ్రస్సెల్స్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే అంశంపై (బ్రెగ్జిట్) కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి శ్రమిస్తున్నట్టు స్పష్టం చేశారు.