నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ వివాహ బంధంలో(Malala Yousafzai marriage) అడుగుపెట్టారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌లో గల తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఈ మేరకు 24 ఏళ్ల మలాలా తన భాగస్వామి అస్సర్ మాలిక్‌తో(malala yousafzai husband ) కలిసి సామాజిక మాధ్యమాల వేదికగా(malala yousafzai marriage pics) ఈవిషయాన్ని వెల్లడించారు.
"ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం"
- మలాలా యూసఫ్‌జాయ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
ఎవరీ అస్సర్ మాలిక్?
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చెందిన హై పర్ఫార్మెన్స్ సెంటర్ జనరల్ మెనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు అస్సర్ మాలిక్. క్రికెట్ బోర్డులో అస్సర్.. ఒక ఉన్నతస్థాయి అధికారి అని పీసీబీ వర్గాలు తెలిపాయి. రెండేళ్ల క్రితం లాహోర్‌లోని పీసీబీ హై పర్ఫార్మెన్స్ సెంటర్ మేనేజర్‌గా చేశారని, ఆ తర్వాత ఆయన పనితీరుతో జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నాయి.
తన భాగస్వామి అస్సర్‌తో మలాలా మలాలా, అస్సర్ మాలిక్ రెండేళ్ల క్రితం తొలిసారి కలిశారు. తర్వాత అప్పుడప్పుడు కలిసేవారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత కుటుంబాల సమ్మతితో వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు.
అస్సర్‌తో మలాలా యూసఫ్‌జాయ్ వివాదాస్పదం..
ఈ ఏడాది జూన్‌లో వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూసఫ్‌జాయ్ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 'మనుషులు ఎందుకు పెళ్లి చేసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావాలనుకుంటున్నప్పుడు, వివాహ పత్రాలపై సంతకం చేయాల్సిన అవసరం ఏముంది? అది ఒక భాగస్వామ్య ఒప్పందంగా ఎందుకు చూడకూడదు?' అని పేర్కొన్నారు.
2012లో మలాలాపై తాలిబన్ల కాల్పులు..
పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా(Malala Yousafzai news) బాలికల విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో తాలిబన్లు పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులకు దిగారు. మలాలా ఎడమ కణతిపై, శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆమెను వెంటనే పెషావర్‌కు తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. అయితే బుల్లెట్ గాయాలకారణంగా ఉత్తమ చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తర్వాత మలాలా కోలుకున్నారు. అనంతరం బ్రిటన్‌లోనే తల్లిదండ్రులతో కలిసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.
ఇక అప్పటి నుంచి మలాలా(Malala Yousafzai latest news) బాలికల విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. మలాలా ఫండ్ పేరుతో బాలికల విద్యకోసం ఛారిటీ సంస్థను నెలకొల్పారు. ఈ క్రమంలో తన సేవలను గుర్తించిన నోబెల్ కమిటీ 2014లో మలాలాకు నోబెల్ శాంతి బహుమతిని అందించింది. దీంతో 17 ఏళ్ల అతిపిన్న వయస్కురాలిగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మాలాలా వార్తల్లో నిలిచారు. 2020లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.
ఇదీ చూడండి:Malala : 'నాపై ఒక్క తూటానే.. అఫ్గానీలపై లక్షల బుల్లెట్ల వర్షం'