తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇలాంటి గుంతల రోడ్లు మనదేశంలోనే ఉంటాయా'

ఓ బ్రిటన్​వాసి.. ఆ దేశంలో గుంతలు పూడ్చిన రోడ్డును ఫొటో తీసి.. 'ఇలాంటి రోడ్లు బ్రిటన్​లోనే ఉంటాయి,' అని ట్వీట్​ చేశారు. వెంటనే ఆ ఫొటో వైరల్​గా మారింది. వివిధ దేశాల ప్రజలు తమ దేశాల్లో రోడ్ల దుస్థితికి అద్దంపట్టే విధంగా ఫొటోలు తీసి జవాబు చెబుతున్నారు. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.

damaged road
గుంతల రహదారులు

By

Published : Jul 19, 2021, 8:50 AM IST

Updated : Jul 19, 2021, 9:27 AM IST

మన దేశంలో గుంతల రోడ్లను చూసి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడం సహజం! ఒక్కోసారి.. 'ఇలాంటి రోడ్లు మన దేశంలోనే ఉంటాయా? లేక వేరే దేశాల్లోనూ ఇంతేనా?' అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథ.

ఇటీవల ఓ ఫొటో ట్విట్టర్​లో వైరల్​గా మారింది. ఓ బ్రిటన్​వాసి.. గుంతలు పూడ్చిన రోడ్డును ట్విట్టర్​లో పెట్టి.. 'బ్రిటన్​లోనే ఇలాంటి రోడ్లు ఉంటాయి,' అని క్యాప్షన్​ జోడించారు. దీనిని ఇతర దేశాల ప్రజలు సీరియస్​గా తీసుకున్నారు. అంతే! ఆయా దేశాల్లో రోడ్ల దుస్థితికి అద్ధం పట్టే విధంగా ఫొటోలు తీసి పెట్టారు. అందులో రష్యా, నైజీరియా, అర్జెంటీనా, పాకిస్థాన్​ సహా భారత్​ దేశాల రోడ్లు ఉన్నాయి. మరి రోడ్ల వ్యవహారం మీరూ చూసేయండి.

'బ్రిటన్​లో కనీసం గుంతలైన పూడ్చుతున్నారు. భారత్​లో అది కూడా లేదు' అని ఓ నెటిజన్​ ట్వీట్​ చేశారు.

అర్జెంటీనాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా.. 'ఈ గుంతకు మూడో పుట్టిన రోజు వేడుకను చేస్తున్నాం,' అని ట్వీట్​ చేసి ఓ ఫొటోలను జోడించాడు. మరికొంతమంది తమ దేశాల్లోని రహదారులపై వాహనాలు మునిగిపోయిన చిత్రాలను పంచుకున్నారు. ఇవి చూస్తే.. "హమ్మయ్య, అక్కడి కంటే ఇక్కడే నయం" అనుకుని మనం ఊపిరిపీల్చుకుంటాం!

Last Updated : Jul 19, 2021, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details