తెలంగాణ

telangana

ETV Bharat / international

వ్యాక్సినేషన్ పూర్తయిన వారు ఆ దేశాల్లో పర్యటించొచ్చు!

కరోనా వ్యాక్సినేషన్​ పూర్తయిన వారు ఈయూ దేశాల్లో పర్యటించేందుకు 27 దేశాలతో కూడిన ఐరోపా సంఘం అనుమతించింది . ఈ మేరకు సంబంధిత రాయబారులు కూడా సమ్మతి తెలిపారు.

european union
ఈయూ

By

Published : May 20, 2021, 7:01 AM IST

కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయినవారు పర్యటించేందుకు అనుమతిస్తూ 27 దేశాలతో కూడిన ఐరోపా సంఘం(ఈయూ)బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల వారు ఈయూలో పర్యాటకానికి మార్గం సుగమం చేస్తూ.. ఈ నిబంధన అమలుకు సంబంధిత రాయబారులు కూడా సమ్మతి తెలిపారు.

ప్రస్తుతానికి 7 దేశాలే..

అలాగే సురక్షిత దేశాలుగా భావించే ప్రాంతాల నుంచి కూడా పర్యాటకుల రాకపోకలకు నిబంధనలను సరళతరం చేసేందుకు కూడా వారంతా అంగీకారం తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా వ్యాప్తి తీరును పరిగణలోకి తీసుకుంటూ.. ప్రస్తుతానికి ఇలాంటి 7 దేశాలను మాత్రమే గుర్తించారు. కొవిడ్ కట్టడికి గాను గత ఏడాది ఈయూ కఠిన నిబంధనలను విధించింది. తాజాగా వాటిని సరళీకరిస్తున్నట్లు ఈయూ కమిషన్ అధికార ప్రతినిధి క్రిస్టియన్​ విగాండ్ తెలిపారు. త్వరలోనే పర్యటకానికి అనుమతించే ఈయూయేతర దేశాల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించారు. ఈయూకి చెందిన 'యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్' సలహాల మేరకు ఇలాంటి దేశాలను గుర్తిస్తామని తెలిపారు.

మహమ్మారి కారణంగా పర్యాటక రంగాన్ని కాపాడుకోవటానికి ఈయూ దేశాలు చాలాకాలంగా అవస్థలు పడుతున్నాయి. ఈసారి వేసవిలో ఈ రంగం పుంజుకోవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి :రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా మృతి

ABOUT THE AUTHOR

...view details