కరోనా మహమ్మారి(Coronavirus news).. ప్రపంచ దేశాలను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ.. ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. జన్యు పరిణామ క్రమాల్లో మార్పులు చేసుకుంటూ.. వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నాయి. అన్ని వేరియంట్లలోకెల్లా డెల్టా రకం.. ఎంతలా భయపెట్టిందో తెలుసు. ఆ తర్వాత దాని నుంచి డెల్టా ప్లస్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉత్పరివర్తనలు వెలుగుచూశాయి.
ఇప్పుడు ఏవై.4.2.(AY covid variant) కేసులు పెరిగిపోతున్నాయి. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా సంక్రమిస్తుంది?
అసలు వైరస్ ఎలా మారుతుంది? వేరియంట్లు ఎలా పుట్టుకొస్తున్నాయి అని పరిశోధించడానికి.. ఇంగ్లాండ్‌లోని నార్తుంబ్రియా విశ్వవిద్యాలయం బృందం ఏప్రిల్‌లో ప్రయత్నించింది. అలా ఏవై.4.2 మూలాలు బయటపడ్డాయి. ముఖ్యంగా భారత్‌కు వెళ్లివచ్చిన ప్రయాణికుల నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. అప్పుడే.. భారత్‌లో కరోనా బీ.1.617 రకం (AY 4.2 coronavirus) వేరియంట్ విజృంభించినట్లు వారికి తెలిసింది. బీ.1.617నే ఆ తర్వాత డబ్ల్యూహెచ్ఓ.. డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టానే (Delta variant news) కారణం.
అయితే.. పరిశోధకులు సేకరించిన నమూనాలు డెల్టా వేరియంట్‌తో సరిపోలలేదు. అంటే.. వైరస్‌లో ఎన్నో ఉత్పరివర్తనాలు ఉన్నాయని, తాము పరిశోధించిన వాటిలో బీ.1.617కు చెందిన ఎన్నో ఉపరకాలున్నాయని తెలిసొచ్చింది.
ఈ డెల్టాలో(Delta variant news) తదనంతరం.. ఎన్నో జన్యుపర మార్పులు(Coronavirus news) చోటుచేసుకున్నాయని.. వాటిలో మరో రకమే ఇప్పుడు వెలుగుచూసిన 'ఏవై'(AY covid variant) అని గుర్తించారు. ఈ ఒక్క ఏవైలోనే (AY 4.2 coronavirus) 75 విభిన్న ఉపవంశాలు ఉన్నాయని, వీటిల్లో ఏవై.4 రకం యూకేను అతలాకుతలం చేస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత కొద్దినెలలుగా.. అక్కడ వెలుగుచూస్తున్న కొత్త కేసుల్లో 63 శాతానికిపైగా వీటివే.
ఏవై.4.2
ఏవై.4లోని ఉపరకమే ఏవై.4.2 కరోనా వేరియంట్(AY covid variant). సెప్టెంబర్ చివర్లో దీనిని గుర్తించారు. యూకేలో మాత్రం జూన్ నెలలోనే వెలుగుచూసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇందులో ఏ222వీ మ్యుటేషన్.. గతేడాది స్పెయిన్‌లో ఉద్భవించినట్లుగా భావిస్తున్న బీ.1.177 ఉపరకంలో వెలుగుచూసింది. ఇది ఎక్కువగా.. పర్యటకుల నుంచే దేశంలో వ్యాప్తి చెందింది. కాబట్టి.. వై145హెచ్ అనే కొత్త మ్యుటేషన్ కారణంగానే ఏవై.4.2 రకం(AY 4.2 coronavirus) కేసులు నమోదవుతున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.