తెలంగాణ

telangana

ETV Bharat / international

రికార్డు: 5 గంటల్లోపే న్యూయార్క్​ టూ లండన్​

బ్రిటిష్​ ఎయిర్​వేస్ విమానం సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఐదు గంటల్లోపే అట్లాంటిక్​ సముద్రం మీదుగా న్యూయార్క్​ నుంచి లండన్ చేరుకుంది. ఫలితంగా గతంలో 5 గంటల 13 నిమిషాలుగా నార్వే ఎయిర్​వేస్​ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.

British Airways flight crosses Atlantic in less than 5 hours
ఐదు గంటల్లోనే బ్రిటన్​ నుంచి న్యూయార్క్​​!

By

Published : Feb 10, 2020, 9:14 PM IST

Updated : Feb 29, 2020, 10:02 PM IST

అట్లాంటిక్​ను అతి తక్కువ సమయంలో దాటేసి బ్రిటిష్​ ఎయిర్​వేస్ విమానం సరికొత్త రికార్డు నెలకొల్పింది.

న్యూయార్క్​లోని జాన్​ ఎఫ్​ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం కేవలం 4గంటల 56 నిమిషాల్లోనే లండన్​లోని హిత్రో విమానాశ్రయానికి చేరుకుంది. ఫలితంగా నార్వే ఎయిర్​ వేస్ విమానం పేరిట ఉన్న రికార్డు(5 గంటల 16నిమిషాలు)ను తిరగరాసింది.

ఫ్లైట్​రాడార్​24 ప్రకారం న్యూయార్క్​ నుంచి లండన్​ చేరడానికి సగటున 6 గంటల 13 నిమిషాలు సమయం పడుతుంది. కానీ బ్రిటీష్ ఎయిర్​వేస్​ విమానం 102 నిమిషాలు ముందుగానే గమ్యాన్ని చేరుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:చైనాకు 'కరోనా' కష్టాలు- రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం

Last Updated : Feb 29, 2020, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details