తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​: పార్లమెంట్​లో బోరిస్​కు సొంత పార్టీ షాక్​

బ్రిటన్​ పార్లమెంట్​లో ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బోరిస్​ బ్రెగ్జిట్​ వ్యూహాన్ని సొంత పార్టీలోని కొందరు సభ్యులు వ్యతిరేకించడమే కాకుండా వారు విపక్షాలతో కలిసిపోయారు. దీంతో హౌస్​ ఆఫ్​ కామన్స్​లో బోరిస్​ మెజారిటీ కోల్పోయారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి బోరిస్​ ప్రణాళికలు రచిస్తున్నారు.

బ్రెగ్జిట్​: పార్లమెంట్​లో బోరిస్​కు సొంత పార్టీ షాక్​

By

Published : Sep 4, 2019, 5:11 AM IST

Updated : Sep 29, 2019, 9:17 AM IST

పార్లమెంట్​లో బోరిస్​కు సొంత పార్టీ షాక్​

బ్రెగ్జిట్​ వ్యూహంపై బ్రిటన్​ పార్లమెంట్​లో ఘోర పరాభవాన్ని చవిచూశారు ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​. ఆరు వారాల క్రితం ప్రధాని బాధ్యతలు చేపట్టిన బోరిస్​కు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కొంతమంది కన్సర్వేటివ్​ పార్టీ ఎంపీలు విపక్షాలతో కలిసిపోయారు. దీంతో హౌస్​ ఆఫ్​ కామన్స్​లో బోరిస్​కు మెజారిటీ లేకుండా పోయింది.

విపక్షాలతో రెబల్స్​ కలిసిపోవడం వల్ల జాన్సన్​కు అనుకూలంగా 301 ఓట్లు, వ్యతిరేకంగా 328 ఓట్లు నమోదయ్యాయి. వీరిలో 21మంది ఎంపీలు సొంత ప్రభుత్వానికే వ్యతిరేకంగా ఓట్లు వేశారు. బోరిస్​ ఓటమితో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలగడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

బుధవారం మరోమారు ఓటింగ్​ జరగనుంది. ఇందులోనూ బోరిస్​ గట్టెక్కకపోతే 2020 జనవరి వరకు బ్రెగ్జిట్​ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

బ్రసెల్స్​తో ఒప్పందం కుదరకపోతే.. అక్టోబర్​ 31న ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడానికి జాన్సన్​ రచిస్తున్న ప్రణాళికలకు అడ్డుకట్ట వేసే ప్రక్రియను ప్రారంభించనుంది విపక్షం.

తనకు వ్యతిరేకంగా ఓటు వేసేవారిపై కఠిన చర్యలు చేపడతానని ప్రధాని హెచ్చరించారు. రెబల్స్​ను పార్టీ నుంచి బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

ముఖ్యమైన ఈయూ సదస్సుకు ముందు.. అక్టోబర్​ 17-18న బ్రిటన్​లో ఎన్నికలు జరగనున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బోరిస్​ భావిస్తున్నారు. ఇందుకు తగిన తీర్మానాన్ని ప్రధాని బుధవారం ప్రవేశపెట్టే అవకాశముంది.

"నేనూ ఎన్నికలను కోరుకోవడం లేదు. బ్రెగ్జిట్​ను అడ్డుకుని, అర్థరహితంగా జాప్యం సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే... ఎన్నికలు ఒక్కటే సమస్యకు పరిష్కారమని అనిపిస్తోంది."

--- బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని.

కానీ ముందస్తు ఎన్నికల తీర్మానం గట్టెక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. హౌస్​ ఆఫ్​ కామన్స్​లో బోరిస్​కు సరైన మెజారీటీ లేకపోవడమే ఇందుకు కారణం.

ఇదీ చూడండి- కశ్మీర్​ రగడ: మాల్దీవులు వేదికగా పాక్​కు భంగపాటు

Last Updated : Sep 29, 2019, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details