తెలంగాణ

telangana

ETV Bharat / international

ఏనుగుల దండయాత్ర- 11 లక్షల డాలర్ల నష్టం!

చైనాలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపును నిలువరించేందుకు అధికారులు అపసోపాలు పడుతున్నారు. యువాన్‌ రాష్ట్రంలోని నేచర్‌ రిజర్వ్ నుంచి 500 కిలోమీటర్లు నడిచిన 15 అడవి ఏనుగుల గుంపును అధికారులు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 70 లక్షల జనాభా గల కున్మింగ్ నగరానికి అవి చేరువగా వచ్చినందున.. వాటిని జనావాసాల నుంచి దూరంగా ఉంచడానికి యత్నిస్తున్నారు.

ELEPHANTS
ఏనుగుల గుంపు

By

Published : Jun 3, 2021, 8:42 PM IST

జనావాసాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపును నిలువరించేందుకు చైనా అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. గత ఏడాది యువాన్‌ ప్రావిన్స్‌లోని నేచర్‌ రిజర్వ్ నుంచి బయటకు వచ్చిన 16 అడవి ఏనుగులు ఏకంగా 500 కిలోమీటర్ల దూరం పయనించాయి. మధ్యలో ఎన్నో పంట పొలాలను, ఇళ్లను ధ్వంసం చేశాయి. అనేక పట్టణాల గుండా ప్రయాణం చేశాయి. ప్రస్తుతం 70 లక్షల జనాభా గల కున్మింగ్‌ నగరానికి అవి చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో జనావాసాల నుంచి వాటిని దూరంగా ఉంచేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

ఏనుగు పుట్టుకతో...

మొత్తంగా 16 ఏనుగులు నేచర్‌ రిజర్వ్‌ నుంచి బయటకు రాగా రెండు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. మధ్యలో ఓ పిల్ల ఏనుగు పుట్టడం వల్ల ప్రస్తుతం 15 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. 360 మందితో కూడిన టాస్క్‌ఫోర్స్‌ ఏనుగులను నిత్యం గమనిస్తోంది. 76 కార్లు, 9 డ్రోన్ల సాయంతో వీరు ఏనుగుల గుంపు కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నారు. గజరాజులు రోడ్లపైకి చేరుకున్నప్పుడు ట్రాఫిక్‌ను నిలువరించడం, అడ్డంకులు ఏర్పాటు చేయడం, ఆహారాన్ని ఎరగా చూపడం వంటి పనులు చేస్తున్నారు.

లీడర్​ ఏనుగుకు అనుభవం లేకే..

ఏనుగులు 500 కిలోమీటర్ల దూరం వలస వెళ్లడం చైనాలో ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. గుంపునకు నేతృత్వం వహిస్తున్న ఏనుగుకు తగిన అనుభవం లేకపోవడం వల్ల ఇలా అడవులు విడిచి వచ్చినట్లు భావిస్తున్నారు. గత వారం ఇషాన్‌ నగరంలో ఏనుగులు వీధుల్లోకి వచ్చిన సమయంలో 6 గంటల పాటు పట్టణవాసులను ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏనుగుల కారణంగా 11 లక్షల డాలర్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:తరిమిన మలేషియా.. తుడిచేసుకొన్న చైనా!

ABOUT THE AUTHOR

...view details