ఐసిస్ సానుభూతిపరుడు న్యూజిలాండ్‌లోని ఓ సూపర్మార్కెట్లో శుక్రవారం(New Zealand supermarket attack) దాడికి తెగబడ్డాడు. కత్తులతో విరుచుకుపడి ఆరుగురిని గాయపరిచాడు. అప్రమత్తమైన పోలీసులు.. అతడిని మట్టుబెట్టారు. అయితే, ఈ దాడికి వెనక ప్రత్యక్షంగా ఐసిస్(ISIS) హస్తమేమీ లేదు. దాని భావజాలాన్ని(isis ideology) ఒంటపట్టించుకున్న దుండగులే ఇలాంటి ఘటనలకు తెగబడుతున్నారు. ఇటీవల ఇలాంటి దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో.. పశ్చిమ దేశాల్లో అసంతృప్తితో జీవనం సాగిస్తున్న కొందరిలో ఐసిస్ భావజాలం పూర్తిగా తొలగిపోలేదని స్పష్టమవుతోంది.
సామాజిక మాధ్యమాలతో...
ఐసిస్‌ను ఓడించినా.. దాని భావజాలం మాత్రం సిరియా, ఇరాక్‌లో(isis in iraq) ఇంకా అలాగే ఉంది. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలన్న ఆశయం, ప్రణాళికలూ కొనసాగుతున్నాయి. పశ్చిమ దేశాల విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేసేవారిని గుర్తించి వారికి తమ బుట్టలో వేసుకుంటోంది ఐసిస్. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను(isis social media) విరివిగా ఉపయోగించుకుంటోంది. వీటికి తోడు ఇతరుల కంట పడకుండా తమ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు డార్క్వెబ్లు, ఎన్క్రిప్టెడ్ ప్లాట్‌ఫాంలు.. వారికి ఉపయుక్తంగా మారుతున్నాయి.
దీంతో ఆన్లైన్ టెర్రరిజంపై(online terrorism) ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్లు, కంప్యూటర్ల ద్వారానే ఉగ్ర భావజాలం గురించి తెలుసుకుంటున్నారు. ఐసిస్ వంటి ఉగ్ర సంస్థల నుంచి ఎలాంటి సహాయం లేకుండానే.. సొంతంగా దాడులకు తెగబడుతున్నారు. అయితే, ఆన్లైన్లో(online isis) ఇలాంటి కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ తమ విషపూరిత అజెండాను(isis agenda) కొనసాగిస్తోంది మాత్రం ఐసిస్ వంటి పెద్ద ముఠాలే.
ఐసిస్‌ను ఓడించడం ఎందుకంత కష్టం?
ఉగ్రవాదాన్ని ఓడించడమంటే(tackling terrorism).. పూర్తిగా దాన్ని నామరూపాలు లేకుండా చేయడమే! ఈ ప్రకారం చూసుకుంటే ఐసిస్ ఎప్పుడూ(isis defeat) ఓడిపోలేదు. ఇరాక్, సిరియాలో ఐసిస్ సైనికంగా ఓటమి చవి చూసినప్పటికీ.. చెల్లాచెదురైన ఈ సంస్థ విభాగాలు ఇతర దేశాల్లో వేళ్లూనుకున్నాయి. అఫ్గానిస్థాన్‌కూ(isis in afghanistan) ఇవి వ్యాపించాయి. తాలిబన్లు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. అఫ్గాన్ నుంచి ఉగ్రవాదం పేట్రేగిపోతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి.. తాలిబన్, ఐసిస్ మిత్ర సంస్థలేం(isis taliban relationship) కాదు. వీరి మధ్య పోరు నడుస్తోందని చెప్పేందుకు తాజా కాబుల్ విమానాశ్రయ(kabul airport attack) ఘటనే ప్రత్యక్ష ఉదహరణ. ఆత్మాహుతి దాడులకు ఐసిస్ ప్రయత్నిస్తుంటే.. వారిని అడ్డుకునేందుకు తాలిబన్లు పని చేశారు.
కానీ, అఫ్గానిస్థాన్‌లో అమెరికా దళాలను తాలిబన్లు ఓడించడం(taliban defeated us) ఐసిస్‌కు సానుకూలాంశమే. ఇది.. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంపొందించేలా వారికి మరింత ప్రోత్సాహం ఇస్తుంది. ప్రపంచంలో ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య ఘర్షణ జరుగుతోందని భావించే ఐసిస్‌కు.. తమ భావజాలాన్ని మరింత విస్తరింపజేసేందుకు ఈ ఘటన ఉపయోగపడుతుంది.
ప్రపంచ స్థాయి చర్యలు..
ఆన్లైన్ ఉగ్రవాదులకు అడ్డుకట్ట(online terrorism) వేసేందుకు న్యూజిలాండ్ ప్రపంచ స్థాయి చర్యలు ఇప్పటికే ప్రారంభించింది. ఆన్లైన్ టెర్రరిజాన్ని అంతమొందించేందుకు ఉద్దేశించిన 'క్రైస్ట్‌చర్చ్' శిఖరాగ్ర(christchurch call to action) సదస్సును నిర్వహించి.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని చాటి చెప్పింది.