149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో వెళ్తున్న బోయింగ్ 737 విమానం కూలిపోయినట్లు ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. అడిస్ అబాబ నుంచి నైరోబీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
విమానం కూలి 157 మంది మృతి!
కూలిపోయిన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానంలో ఉన్న 157 మంది మృతి చెందారని ఆ దేశ మీడియా ప్రకటించింది.
విమానం క్రాష్(ప్రతీకాత్మక చిత్రం)
ప్రయాణికుల కోసం ఇంకా గాలిస్తున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. బోలే విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 6 నిమిషాల్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇథియోపియా ప్రధానమంత్రి ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Last Updated : Mar 10, 2019, 4:44 PM IST