తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ20కి ట్రంప్​: ఉద్రిక్తతలకు తెరపై ఆశలు - వాణిజ్య

జపాన్​లో ఈ వారం జరగనున్న జీ-20 సదస్సులో భాగంగా వేర్వేరు దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భేటీ కానున్నారు. చైనా, రష్యా అధ్యక్షులు జిన్​పింగ్, పుతిన్​తో వాణిజ్య సంబంధాలపై చర్చలు జరపనున్నారు.

జీ20కి ట్రంప్​: ఉద్రిక్తతలకు తెరపై ఆశలు

By

Published : Jun 25, 2019, 10:16 AM IST

Updated : Jun 25, 2019, 12:11 PM IST

జీ20కి ట్రంప్​: ఉద్రిక్తతలకు తెరపై ఆశలు

జపాన్​ ఒసాకాలో ఈ వారం జరగనున్న జీ-20 సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు.

జాబితాలో చాలా మందే...

భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్​ ఛాన్స్​లర్ ఏంజెలా మెర్కెల్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, జపాన్​ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ సహా పలువురు దేశాధినేతలతో ట్రంప్​ చర్చలు జరపనున్నారు.

వాణిజ్య యుద్ధం ముగిసేనా..?

ట్రంప్​, జిన్​పింగ్​​ సమావేశంతో అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ముగిసే దిశగా మరో అడుగు పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సమావేశం కోసం ఇప్పటికే ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఫోన్​లో సంభాషించినట్లు చైనా మీడియా పేర్కొంది. జీ20 సదస్సు ప్రారంభమైన రెండో రోజు.. జూన్ 29న ట్రంప్​-జిన్​పింగ్​ భేటీ జరిగే అవకాశం ఉంది.

సౌదీ యువరాజుతో...

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్​తో ఇరాన్​- అమెరికా ఉద్రిక్తతలపై ప్రత్యేకంగా ట్రంప్​ చర్చించనున్నారు.

సియోల్​కు పయనం...

జీ20 సదస్సు ముగిశాక అమెరికా అధ్యక్షుడు దక్షిణ కొరియా సియోల్​కు పయనం కానున్నారు. అయితే ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దులోని సైనిక రహిత ప్రాంతాన్ని (డీఎమ్​జెడ్​) ట్రంప్​ సందర్శిస్తారా లేదా అన్న విషయంపై అమెరికా స్పష్టత ఇవ్వలేదు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​తో మాత్రం భేటీ లేదని అగ్రరాజ్యం తెలిపింది. ఇప్పటికే ఇరు దేశాధినేతలు 2 సార్లు భేటీ అయ్యారు.

Last Updated : Jun 25, 2019, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details