తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంకలో మళ్లీ పేలుళ్ల కలకలం...

ఈస్టర్​ సండే మారణహోమం అనంతరం శ్రీలంకలో మరోసారి పేలుళ్లు సంభవించాయి. నిందితుల కోసం కల్ముణై నగరంలో భద్రతా దళాలు  తనిఖీలు నిర్వహిస్తుండగా మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి.

శ్రీలంకలో మళ్లీ పేలుళ్ల కలకలం...

By

Published : Apr 27, 2019, 6:49 AM IST

లంకలో మళ్లీ పేలుళ్లు

శ్రీలంకలో మరోసారి పేలుళ్లు కలకలం సృష్టించాయి.లంక భద్రతా సిబ్బంది...శుక్రవారం రోజు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా మరో 3 ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే.. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లు తెలిపారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఏప్రిల్​ 21న హోటళ్లు, చర్చిల్లో వరుస ఉగ్రదాడులతో 250 మందికి పైగా మరణించారు. మరో 500 మందికి పైగా గాయాలయ్యాయి.

భద్రతా సిబ్బంది తనిఖీల్లో భాగంగా సమ్మంతురై నగరం వద్ద భారీగా ఐసిస్​ ఉగ్రవాదుల యూనిఫామ్స్​, జెండాలు, మందు గుండు సామగ్రి, లక్ష బాల్​ బేరింగ్స్​, డ్రోన్​ కెమెరాలు లభ్యమయ్యాయి.

సీసీటీవీ ఫుటేజ్​లో దృశ్యాలు...

కొలంబో కింగ్స్​బరీ హోటల్​లో పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్​లో రికార్డయ్యాయి. అందులో నిందితుడు హోటల్​కు ప్రవేశించేది స్పష్టంగా కనిపించింది.

క్షణక్షణం భయం భయంగా...

ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంతో ప్రతి క్షణం బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు లంక వాసులు. ఇంట్లోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.

పర్యటకంలో భారీ నష్టాలు...!

శ్రీలంకకు పర్యటకం ముఖ్య ఆదాయ వనరు. పర్యటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి ఇక్కడి అందమైన ప్రదేశాలు. అయితే.. ఇటీవలి పేలుళ్లతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తమ దేశానికి వచ్చే వారిలో దాదాపు 30 శాతం మంది పర్యటనలను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించింది సంబంధిత మంత్రిత్వ శాఖ. పర్యటక రంగంపై ఇది పెను ప్రభావం చూపే అవకాశమున్నట్లు తెలిపింది.

ఈ ఏడాది పర్యటక రంగానికి దాదాపు 1.5 బిలియన్​ డాలర్ల నష్టం వస్తుందని అంచనా వేశారు లంక ఆర్థిక మంత్రి.

ఇదీ చూడండి:359 కాదు 253 మందే మరణించారు: శ్రీలంక

ABOUT THE AUTHOR

...view details