తెలంగాణ

telangana

ETV Bharat / international

'సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులే ఉన్నాయి' - China foreign ministry

భారత్​ సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగానే ఉందని చైనా తెలిపింది. చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది.

China
చైనా

By

Published : Jun 29, 2021, 6:18 AM IST

భారత్​ సరిహద్దు వద్ద పరిస్థితులు సాధారణ స్థాయిలో స్థిరంగా ఉన్నాయని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్ పేర్కొన్నారు. శాంతియుతంగా చర్చల ద్వారానే సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఇరువర్గాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. చైనా సరిహద్దులకు అదనంగా 50 వేల మంది సైనికులను భారత్ పంపించిందంటూ పాశ్చాత్య మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన ఈ మేరకు స్పందించారు.

"భారత్​ సరిహద్దు వద్ద సాధారణ పరిస్థితులే ఉన్నాయి. సరిహద్దు సమస్యను ఇరుపక్షాలు చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ, సైనికాధికారుల మాటలు, పనులు ఉద్రిక్తతలను తగ్గించేలా, విశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. అందుకు విరుద్ధంగా ఉండకూడదు."

- వాంగ్ వెన్​బిన్, చైనా విదేశాంగ ప్రతినిధి

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణపై మరోసారి భారత్​-చైనా సైనిక చర్చలు జరపడానికి అంగీకరించిన కొన్ని రోజుల్లోనే వాంగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి:ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details