శరణార్థులకు బాసటగా నిలిచింది పాకిస్థాన్ మహిళ. అఫ్గానిస్థాన్ నుంచి వలసవచ్చిన 25 మంది మహిళలకు నగల తయారీలో శిక్షణనిచ్చి ఫ్యాషన్ ద్వారా వారి జీవితాలలో మార్పుతెచ్చింది హుమా అద్నాన్. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్(యూఎన్‌హెచ్‌సీఆర్) ఆధ్వర్యంలో వీరి కళానైపుణ్యాలను వెలుగులోకి తీసుకువచ్చారు. శరణార్థులు రూపొందించిన ఆభరణాలతో దక్షిణ కరాచీలో జరిగిన ఫ్యాషన్‌షో ఆకట్టుకుంది.
శరణార్థులకు బాసటగా
మహిళలకిచ్చిన శిక్షణతో వారి సొంత దేశం వెళ్లినా.. ఉపాధికి భరోసా దొరుకుతుందని హుమా అద్నాన్ తెలిపారు.
ఫ్యాషన్
1979 అఫ్గాన్ యుద్ధ సమయంలో చాలామంది పాకిస్థాన్‌లో తలదాచుకునేందుకు వచ్చారు. 2019తో వలసవచ్చి 40 ఏళ్లు పూర్తయ్యాయి.