పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం కారణంగా ఆ దేశ టెక్స్టైల్స్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది. భారత్ నుంచి నూలు, దారం దిగుమతులు చేసుకోవాలన్న ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదనలను ఆయన గురువారం తిరస్కరించారు. జమ్ముకశ్మీర్‌కు మళ్లీ స్వయం ప్రతిపత్తి వచ్చేంతవరకూ భారత్‌తో సాధారణ సంబంధాలు వద్దని తమ ప్రధాని స్పష్టం చేశారని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తెలిపారు.
అయితే.. ప్రభుత్వ నిర్ణయం పట్ల పాకిస్థాన్ అపారల్ ఫోరమ్ ఛైర్మన్ జావెద్ బిల్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు 'ది డాన్' పత్రిక పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా.. పాకిస్థాన్ టెక్స్టైల్ పరిశ్రమ ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో పన్ను రహితంగా భారత్ సహా.. పలు దేశాల నూలు, పత్తి, దారాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి.