పాకిస్థాన్ వైమానిక దళం ఆధ్వర్యంలోని ఓ మ్యూజియంలో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పోలిన విగ్రహాన్ని ప్రదర్శనలో ఉంచారు.కరాచీలోని ఈ మ్యూజియంలో విగ్రహం ముందు ఒక టీ కప్పును, మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్ శిథిల భాగాన్ని ఉంచారు.
ఈ గ్యాలరీకి 'ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్' అని పేరు పెట్టారు. వర్ధమాన్ విమానం కూలిపోయిన సన్నివేశాన్ని, వాఘా సరిహద్దు వద్ద ఆయనను తిరిగి భారత్‌కు అప్పగించిన ఫొటోలను ప్రదర్శించారు.
ఈ మ్యూజియంలో కొత్తగా ఏర్పాటు చేసిన భాగాన్ని ఈ వారమే ప్రారంభించారు పాక్ ఎయిర్ మార్షల్ చీఫ్ ముజాహిద్ అన్వర్ ఖాన్.
ఫిబ్రవరి 27న పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చారు వర్ధమాన్. అనంతరం తన మిగ్-21 యుద్ధవిమానమూ ప్రమాదానికి గురైంది. పారాష్యూట్ సాయంతో ప్రాణాలతో బయటపడ్డ అభినందన్... పాకిస్థాన్ భూభాగంలో దిగారు. పాక్ సైనికులు ఆయనను అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. మూడు రోజుల తర్వాత వాఘా సరిహద్దు వద్ద పాక్ సైన్యం అభినందన్‌ను భారత్‌కు తిరిగి అప్పగించింది. అతని ధైర్వసాహసాలకు ప్రతీకగా అభినందన్‌కు వీర్ చక్ర పతకం వరించింది.
ఇదీ చూడండి: న్యాయవ్యవస్థను అస్థిరపరిచే కుట్ర: సీజేఐ