యెమెన్ ప్రభుత్వ బలగాలు, హౌతీ మిలీషియా మధ్య ఘర్షణలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. థాయిజ్ నైరుతి ప్రాంతంలో, చమురు అత్యధికంగా లభ్యమయ్యే మారిబ్ ప్రాంతాల్లో శనివారం వివాదం చెలరేగినట్లు మిలిటరీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా హౌతీలు 'ఆల్ఔట్ మిలిటరీ ఆపరేషన్స్' చేపడుతున్నారని.. 60 మంది హౌతీ మిలీషియా సభ్యులు, 36 మంది సైనికులు మృతి చెందారని అధికారి స్పష్టం చేశారు. ఈ వివాదంలో ఇరువర్గాల్లో చాలా మంది క్షతగాత్రులయ్యారు.