తెలంగాణ

telangana

ETV Bharat / international

అన్నం లేదు కానీ...

అణ్వస్త్ర ప్రయోగం. అగ్రరాజ్యంతో కయ్యం. ఉత్తర కొరియా ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వినిపించే మాటలు. అమెరికాపైనే దాడి చేస్తామనే బెదిరింపుల వెనుక... ఎవరికీ వినిపించని ఆకలి కేకలు ఉన్నాయి. దేశంలో సగంపైగా జనాభాకు తినడానికి తిండి లేదు.

By

Published : Mar 7, 2019, 4:11 PM IST

ఉత్తర కొరియా

అణు పరీక్షలతో ప్రపంచ పెద్దన్ననే గడగడలాడించిన దేశం ఉత్తరకొరియా. ప్రజాసంక్షేమంలో మాత్రం అధ్వాన స్థితిలో ఉంది. జనాభాలో సగానికిపైగా ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో ఈ హృదయవిదారక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఉత్తర కొరియాలో ఆహార కొరతపై నివేదిక విడుదల చేసింది ఐక్యరాజ్య సమితి. దేశంలోని కోటి 10 లక్షల మంది సరైన ఆహారం అందక ఆకలితో అలమటిస్తున్నారని, జనాభలో సుమారు ఇది 43 శాతమని తేల్చింది. ప్రస్తుతం ఉత్తర కొరియా 1.4 మిలియన్ టన్నుల ఆహార లోటు ఎదుర్కొంటుందని ఐరాస తెలిపింది.

పత్రి ఐదుగురిలో ఒకరు పోషకాహార లోపంతో అలమటిస్తున్నారని నివేదిక పేర్కొంది. తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నట్లు గుర్తించింది.

ఆరోగ్య సేవలు పరిమితంగా అందుతున్నందున సాధరణ రోగాలుకూ పిల్లలు ప్రాణాలు విడుస్తున్నారని ఐరాస నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది.

ఆహార కొరతకు కారణాలివే:

⦁ సాగు భూమి విస్తీరణం తక్కువుగా ఉండటం.

⦁ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించక దిగుబడులు తక్కువుగా ఉండటం.

⦁ ఎరువులు కొరత, సహజ విపత్తులు.

ఉడత సాయం :

గత సంవత్సరం 60లక్షల మంది ప్రజలకు సహాయం చేయడానికి తాము 111 మిలియన్​ డాలర్లు సేకరించామని, ఇది వారి అవసరాల్లో 24 శాతమేనని ఐరాస తెలిపింది. ఈ ఏడాది 120 మిలియన్​ డాలర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details