న్యూజిలాండ్‌లో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి(new zealand corona cases). వీటిలో 206 స్థానికంగా వెలుగుచూసివని కాగా.. ఒక్క కేసు సరిహద్దులో వేరే ప్రాంతానికి చెందింది. న్యూజిలాండ్‌లో కొద్దిరోజుల క్రితం కరోనా కేసులు సున్నాగా ఉన్నప్పటికీ.. డెల్టా వేరియంట్ వ్యాప్తి మొదలైన తర్వాత(new zealand delta variant) కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి ఆ దేశంలో మొత్తం డెల్టా కేసుల సంఖ్య 4,240కి చేరింది. వీటిలో ఆక్లాండ్‌లోనే 4,047 కేసులున్నాయి. వైకాటోలో 154, వెల్లింగ్టన్లో 17, నార్తాలాండ్లో 17, కౌంటర్బురీలో 4, నెల్సన్-మార్ల్బోరోలో ఒక్క కేసు నమోదయ్యాయి.
కరోనా బాధితుల్లో 73మంది వివిధ ఆస్పత్రులతో చికిత్స పొందుతున్నట్లు న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ తెలిపింది(new zealand news). వీరిలో ఏడుగురు ఐసీయూలో ఉన్నట్లు పేర్కొంది. కరోనాను అత్యంత విజయవంతంగా కట్టడి చేసిన ఈ దేశంలో(new zealand covid) ఇప్పటివరకు మొత్తం 7,138 కేసులే నమోదయ్యాయి. 29 మంది మరణించారు.