తెలంగాణ

telangana

ETV Bharat / international

సరస్సుపై స్కేటింగ్​

రష్యాలోని సైబీరియాలో బైకాల్​ సరస్సుపై నిర్వహించిన 'బైకాల్​ ఇంటర్నేషనల్​ స్కేటింగ్​ మారథాన్'​ స్కేటింగ్​ ప్రియులను ఆకట్టుకుంది. నీరు గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా 200 మందికిపైగా ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

'బైకాల్​ ఇంటర్నేషనల్​ స్కేటింగ్​ మారథాన్'​

By

Published : Mar 5, 2019, 7:04 AM IST

రష్యాలోని సైబీరియాలో బైకాల్​ సరస్సుపై స్కేటింగ్​ విన్యాసాలు

స్కేటింగ్ అంటే తెలియని వారుండరు. మంచుపై చేసే స్కేటింగ్​ విన్యాసాలు అందరినీఆకట్టుకుంటాయి. కానీ గడ్డకట్టిన సరస్సుపై స్కేటింగ్​ చేయడం చాలా అరుదు. అది అంత సులువేమీ కాదు.

రష్యాలోని సైబీరియాలో ఉన్న ప్రపంచ అతిపెద్ద, అతిలోతైన బైకాల్​ సరస్సులో స్కేటింగ్​ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 200మందికిపైగా స్కేటింగ్​ ప్రియులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నీరు గడ్డకట్టే చలిని సైతం వీరు లెక్కచేయలేదు.

'బైకాల్​ ఇంటర్నేషనల్​ స్కేటింగ్​ మారథాన్​' కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో 5 నుంచి 100 కిలోమీటర్ల దూరం వరకు నిర్వహించే పోటీలూ ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details