తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈ నేపాలీ 'రాక్​స్టార్​'​.. కాఫీ కళకు రారాజు

ప్రపంచవ్యాప్తంగా కాఫీకి ఉన్న క్రేజే వేరు. ఆ సువాసనను అస్వాదిస్తూ కాఫీ ప్రియులు మైమరచిపోతారు. ఇప్పుడు కాఫీ మీద రకరకాల ఆకృతులు వేసి సర్వ్ చేయడం ట్రెండ్​. ఈ కళను నేర్చుకోవడం అంత సులభం కాదు. అలాంటిది లండన్​లో ఈ కళపై జరిగే పోటీల్లో ఏకంగా ఆరుసార్లు టైటిల్​ కైవసం చేసుకున్నాడు నేపాల్​కు చెందిన ధాన్​ తమంగ్​.

ఈ నేపాలీ 'రాక్​స్టార్​'​.. కాఫీ కళకు రారాజు

By

Published : Apr 9, 2019, 10:31 AM IST

కాఫీపై సుందరమైన ఆకృతులు

కాఫీపై ఎంతో అద్భుతంగా బొమ్మలు వేస్తున్న ఇతడి పేరు ధాన్​ తమంగ్​. గత ఆరేళ్లుగా సుందరమైన ఆకృతులను వేసి లండన్​లో జరిగే లాటే ఆర్ట్​ ఛాంపియన్​ విజేతగా నిలిచాడు తమంగ్.

బరిస్టాలో వెయిటర్​గా పని చేసిన తమంగ్​ చాక్లెట్లపై అందమైన రూపాలు వేసేవాడు. వీటినే కాఫీపై వేయాలనే అలోచన వచ్చింది ఈ నేపాలీ వాసికి. వెంటనే ఆ పనిలో నిమగ్నమయ్యాడు.

అనుకున్నంత సులభమేం కాదు ఈ కళ. ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. కఠోర సాధన అనంతరం 2013లో తొలిసారి యూకే లాటే ఆర్ట్​ ఛాంపియన్​షిప్​ కైవసం చేసుకున్నాడు. అప్పటి నుంచి తమంగ్​ వెనక్కి తిరగిచూసుకోలేదు. వరుసగా 6 సార్లు టైటిల్​ సొంతం చేసుకున్నాడు.

"ప్రతీ యేడూ, నాకు తెలిసిన లాటే కళను మెరుగుపరచుకుంటున్నా. నా తొలి ఛాంపియన్​షిప్​ 2013లో వచ్చింది. అప్పటికీ.. 2018 మధ్య చాలా మార్పులు వచ్చాయి."

ముందు ఎస్ప్రెస్సోను కప్​లో పోసి, సగానికి పైగా వేడి వేడి పాలను నింపుతాడు తమంగ్​. అనంతరం నురుగుతో కప్​ను నింపేస్తాడు. ఈ ప్రక్రియతో కాఫీపై పువ్వులు, హంస బొమ్మలను గీస్తాడు.

పదేళ్ల పాటు కాఫీ పరిశ్రమలో పనిచేసిన అనుభవం ఉన్న తమంగ్​... తనకు వచ్చిన కళను ఇతరులకు పంచడానికి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాడు. విద్యార్థులతో పాటు తమంగ్​కు అభిమానులూ ఎక్కువే. కాఫీ ప్రపంచంలో తమంగ్​ ఓ రాక్​స్టార్​. తమంగ్​ కళను చూస్తూ అలాగే ఉండిపోతారు అభిమానులు.

ABOUT THE AUTHOR

...view details