విదేశీ శక్తుల కవ్వింపు చర్యలను ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసన్నద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ఆగస్టులో దక్షిణ కొరియా-అమెరికా సైన్యాలు సంయుక్తంగా విన్యాసాలు చేపట్టనున్న తరుణంలో.. సైనికాధికారులతో సమావేశమై, ఈమేరకు దిశానిర్దేశం చేశారు.
ఇదే మొదటిసారి..
జులై 24-27 వరకు మిలిటరీ అధికారులతో చర్చించి, కార్యాచరణను సిద్ధం చేశారు కిమ్. ఉత్తర కొరియా సైనిక వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి ఇలాంటి సుదీర్ఘ సమావేశం జరగటం ఇదే మొదటిసారని కొరియా జాతీయ మీడియా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. ప్రధాన ప్రత్యర్థి శక్తులు కలిసి.. వారి యుద్ధ విన్యాసాలను, సైనిక సామర్థ్యాలను ప్రదర్శించాలని చూస్తున్నాయని.. అందుకు సైన్యం సన్నద్ధంగా ఉండాలని, బలగాల సామర్థ్యం పెంచాలని సూచించినట్లు వివరించింది.
మాటలు కలిపినా..
ఉత్తర కొరియా అధినేత కిమ్.. ఇటీవల తమ చిరకాల ప్రత్యర్థి అయిన దక్షిణ కొరియాతో సత్సంబంధాలు ప్రారంభించారు. దీంతో కొరియన్ ద్వీపకల్పంలో శాంతియుత వాతావరణాన్ని చూడనున్నామా? అని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
క్షిపణుల వర్షం తప్పదు..