తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్ ప్రధానిగా ఐదోసారి నెతన్యాహూ? - netanyuha

ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రధాని బెంజిమన్​ నెతన్యాహూ మరోసారి గెలుపొందుతారని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ సారి విజయం సాధిస్తే వరుసగా ఐదో సారి బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పుతారు నెతన్యాహూ.

ఇజ్రాయెల్ ప్రధానిగా ఐదోసారి నెతన్యాహూ?

By

Published : Apr 10, 2019, 3:20 PM IST

ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని బెంజిమన్​​ నెతన్యాహూ సారథ్యంలోని లికుద్​ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలున్నాయని ఆ దేశ మీడియా ఎగ్జిట్​ పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

97శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి మొత్తం 120 పార్లమెంటు స్థానాలను నెతన్యాహూ సారథ్యంలోని లికుద్ పార్టీ మిత్రపక్షాల మద్దతుతో 65 స్థానాల వరకు గెలుపొందుతుందని అక్కడి మీడియా తెలిపింది.

పూర్తి మెజారిటీ సాధించకపోయినా మిత్రపక్షాల మద్దతుతో నెతన్యాహూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు.

ఇది గొప్ప విజయమని తెలుపుతూ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు నెతన్యాహూ.

ముందుగా ప్రకటించిన సర్వే ఫలితాలు.. ప్రతిపక్ష నేత బెన్నీ గంజ్ సారథ్యంలోని 'బ్లూ అండ్ వైట్'​ కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపాయి. అవినీతి ఆరోపణలున్నప్పటికీ నెతన్యాహూ మరోసారి గెలుపొందే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: ఓటుకు నోటు ఇచ్చేవారిపై ఉక్కుపాదం: ఈసీ

ABOUT THE AUTHOR

...view details