తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇండోనేసియా: పునరావాస శిబిరాల్లోనే వేలాది మంది

ఇండోనేసియాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు తోడు.. కొండచరియలు విరిగిపడడం కారణంగా ఇప్పటివరకు దేశంలో 43 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాజధాని జకార్తా సహా పలు ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

indonesia
ఇండోనేషియా వరదలు

By

Published : Jan 3, 2020, 3:28 PM IST

ఇండోనేసియా వరద బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు.దాదాపు 40,000 మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గల్లంతైన వారి కోసం విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసింది.

భారీ వరదల కారణంగా దేశ రాజధాని జకార్తా నీట మునిగింది. విద్యుత్తు లేక అంధకారం అలుముకుంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ స్తంభించింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదీ చూడండి:చల్లని మంచు.. మెల్లగా వచ్చి రహదారిని ముంచేసింది!

ABOUT THE AUTHOR

...view details