తెలంగాణ

telangana

ETV Bharat / international

'తలపై తుపాకీ పెట్టి మాట్లాడమంటే ఎలా?' - ఉగ్రవాదం

ఉగ్రవాదంపై పాకిస్థాన్​తో చర్చలకు భారత్​ సిద్ధంగానే ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్​ అంతర్జాతీయ వేదిక మీద ప్రకటించారు. అయితే ఈ చర్చలు తలపై తుపాకీ పెట్టిన పరిస్థితుల్లో కాకుండా స్వేచ్ఛాయుత మార్గంలో జరగాలన్నారు.

విదేశాంగ మంత్రి జైశంకర్​

By

Published : Sep 6, 2019, 7:26 PM IST

Updated : Sep 29, 2019, 4:29 PM IST

ఉగ్రవాదంపై పాకిస్థాన్​తో చర్చలకు భారత్​ సిద్ధం!

కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​ ఎత్తుగడలను అంతర్జాతీయ వేదికలో భారత్​ మరోసారి ఎండగట్టింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు భారత్​ సిద్ధంగా ఉందని మన దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అయితే అవి ఉద్రిక్తతల నడుమ జరిగే అవకాశం లేదని తేల్చిచెప్పారు.

సింగపూర్​లో జరుగుతున్న మింట్​ ఆసియా నాయకత్వ సదస్సులో కశ్మీర్​ సమస్యపై మాట్లాడారు జైశంకర్.

"ఉగ్రవాదంపై పాకిస్థాన్​తో చర్చలకు భారత్ సిద్ధంగా ఉంది. అయితే ఈ చర్చలు మా తలపై తుపాకీ పెట్టి డిమాండ్​ చేసినట్లు కాకుండా స్వేచ్ఛాయుత మార్గంలో జరగాలి. పాక్​లో 40 ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. చర్చలకు సిద్ధం అంటూనే రాత్రికి వచ్చి మీ దేశంలోని నగరాలను అణుబాంబులతో పేల్చేస్తామని చెప్పడం సరికాదు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఏదైనా చర్చించాల్సి వస్తే ఈ రెండు దేశాలు మాత్రమే మాట్లాడుకోవాలి."

-జైశంకర్​, భారత విదేశాంగ మంత్రి

ఇదీ చూడండి: పాకిస్థాన్​కు కశ్మీర్ కంఠసిర: ఇమ్రాన్​ఖాన్​

Last Updated : Sep 29, 2019, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details