తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంగ్​కాంగ్​: వర్షాన్నీ లెక్కచేయకుండా నిరసనలు

హాంగ్​కాంగ్​లో పది వారాల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఆందోళనలతో హాంగ్​కాంగ్​ పార్కు, ప్రధాన వీధులు నిండిపోయాయి. వర్షం కురుస్తున్నా వెనకడుగు వేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు.

By

Published : Aug 18, 2019, 6:58 PM IST

Updated : Sep 27, 2019, 10:27 AM IST

హాంగ్​కాంగ్​: వర్షాన్నీ లెక్కచేయకుండా నిరసనలు

నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్నీ లెక్కచేయకుండా గొడుగులు పట్టుకుని హాంగ్​కాంగ్​ పార్కులో ఆందోళన చేస్తున్నారు. పార్కు నిండిపోవడం వల్ల హాంగ్​కాంగ్​లోని ప్రధాన రోడ్డుపైనా తమ నిరసనలు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు.

హాంగ్​కాంగ్​: వర్షాన్నీ లెక్కచేయకుండా నిరసనలు

వర్షం పడుతున్నప్పటికీ నిరసనలు కొనసాగుతాయని ఆందోళనకారులు తేల్చి చెబుతున్నారు. తమ డిమాండ్​లు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.

ఆందోళనల కారణంగా హాంగ్​కాంగ్​ ఆర్థిక పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. నిరసనకారులకు అమెరికా ప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారని చైనా ఆరోపించింది.

ఇదీ చూడండి:'పాక్​తో చర్చలంటూ జరిగితే 'పీఓకే'పై మాత్రమే'

Last Updated : Sep 27, 2019, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details