తెలంగాణ

telangana

ETV Bharat / international

వధువుకు వరుడి భారీ 'గిఫ్ట్'​- 60 కిలోల బంగారంతో... - గిఫ్ట్​

పెళ్లిళ్లలో గిఫ్ట్​లు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. కానీ ఓ వరుడు తన కాబోయే భార్యకు ఎవరూ ఊహించని విధంగా కానుక ఇచ్చాడు. అతడిచ్చిన ఆ గిఫ్ట్​తో పెళ్లి వేడుకకు హాజరైన ఆ వధువును చూసి అక్కడివారంతా షాక్​ అయ్యారు. అసలు ఆ గిఫ్ట్​లో ఏముంది? వారంతా ఎందుకు షాక్​ అయ్యారు?

Groom gifts wife 60 kg gold
గిప్ట్​

By

Published : Oct 17, 2021, 3:09 PM IST

చైనాలోని హుబే రాష్ట్రంలో సెప్టెంబర్​ 30న ఓ వివాహ వేడుక జరిగింది. అక్కడకు వెళ్లిన అతిథులు వధువును చూసి ఆశ్చర్యపోయారు. ఆ వధువు 60కేజీల బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం ఇందుకు కారణం!

ఆ నగలను వరుడు వధువుకు కానుకగా ఇచ్చాడు. 60 గోల్డ్​ నెక్లెస్​లు(ఒక్కోటి 1కేజీ ఉంటుంది), రెండు భారీ బంగారు గాజులు వధువుకు గిఫ్టుగా అందించాడు.

అంత భారీ ఆభరణాలు ధరించిన వధువులు అసలు నడవలేకపోయింది. అది గమనించిన వరుడు ఆమెకు సహాయం చేశాడు.

60కేజీల గోల్డ్​తో వధువు..

60కేజీల బంగారు ఆభరణాలు వేసుకున్న వధువు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. నెటిజన్లు 'వావ్​' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చూడండి:-కుక్కర్​ను పెళ్లాడిన యువకుడు.. నాలుగు రోజులకే విడాకులు!

ABOUT THE AUTHOR

...view details