తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇమ్రాన్​జీ... విమానం ఇచ్చి పంపితే అలా చేస్తారా?'

"ఇమ్రాన్​ ఖాన్​ కమర్షియల్ ఫ్లయిట్​లో అమెరికా వెళ్లేందుకు సౌదీ యువరాజు అస్సలు ఇష్టపడలేదు. తన విమానంలోనే వెళ్లాలని పట్టుబట్టారు"... పాక్ ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ వర్గాలు చేసిన ప్రకటన ఇది. అమెరికా వెళ్లడం వరకు బాగానే ఉన్నా... ఇమ్రాన్​ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం కథ అడ్డం తిరిగింది. సౌదీ యువరాజు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అనేక గంటల ఎదురుచూపుల తర్వాత కమర్షియల్ ఫ్లయిట్​లోనే పాక్ తిరిగొచ్చారు ఇమ్రాన్. ఇంతకీ ఏం జరిగింది?

ఇమ్రాన్‌ ఇక చాలు..మా విమానం ఇచ్చెయ్‌..!

By

Published : Oct 7, 2019, 5:47 PM IST

ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తిరిగివస్తున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో తిరిగి న్యూయార్క్‌లోనే అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యారు. అయితే దీనికి అసలు కారణం సాంకేతిక లోపం కాదట! ఇమ్రాన్‌ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రదర్శించిన దౌత్య నీతితో సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారట. అందువల్లే తన ఫ్లైట్‌లో అతిథి మర్యాదలు చేసి పంపిన సల్మాన్‌ తిరిగి తన విమానాన్ని తనకు అప్పగించాలని పాక్‌ బృందాన్ని కోరారట. దీనిపై పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ వార పత్రిక ‘ఫ్రైడే టైమ్స్‌’ ఓ కథనం ప్రచురించింది.

ఐరాస సమావేశాలకు వెళ్లడానికి ముందు రెండురోజులు పాటు ఇమ్రాన్‌ఖాన్‌ సౌదీలో పర్యటించారు. అయితే అతిథిగా వచ్చిన ఇమ్రాన్‌ను కమర్షియల్‌ విమానంలో పంపడం ఇష్టంలేక సౌదీ యువరాజు తన ప్రైవేట్‌ జెట్‌ను ఇచ్చారు. దీంతో ఇమ్రాన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందం దాంట్లోనే అమెరికా పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగించుకొని వస్తుండగా.. సాంకేతిక లోపం తలెత్తి తిరిగి న్యూయార్క్‌ వెళ్లారు. తర్వాతి రోజు కమర్షియల్‌ ఫ్లైట్‌లో ఇస్లామాబాద్‌ చేరుకొన్నారు. అయితే తాజా ‘ఫ్రైడే టైమ్స్‌’ కథనం మాత్రం ఈ వాదనతో పూర్తిగా విభేదించింది.

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌, మలేషియా ప్రధాని మహతిర్‌ మహ్మద్‌తో కలిసి ఇస్లామిక్‌ దేశాల వాదనను వినిపించాలనుకోవడం సౌదీ యువరాజుకు నచ్చలేదట. పైగా తన అనుమతి లేకుండా ఇరాన్‌తో చర్చలు జరపడంపై కూడా మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ గుర్రుగా ఉన్నారని ‘ఫ్రైడే టైమ్స్‌’ పేర్కొంది. ఈ నేపథ్యంలో తన విమానాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరి తన అసంతృప్తిని వ్యక్తం చేశారని కథనం ప్రచురించారు.

ఇదీ చూడండి : హైపోక్సియాపై పరిశోధనలు చేసిన ముగ్గురికి నోబెల్

ABOUT THE AUTHOR

...view details