తెలంగాణ

telangana

ETV Bharat / international

ముస్లిం ఫకీరు వేడుకకు హిందూ భక్తులు..!

16వ శతాబ్దానికి చెందిన సూఫీ సన్యాసి మాధోలాల్ హుస్సేన్​ని స్మరిస్తూ పాకిస్థాన్​లో మేలా చిరాఘ్ వేడుకను నిర్వహించారు. వేల సంఖ్యలో ప్రజలు హాజరై తమ మొక్కులు తీర్చుకున్నారు. మతాలకు అతీతంగా హిందూ భక్తులు హాజరయ్యారు.

By

Published : Apr 2, 2019, 8:49 PM IST

మేలా చిరాఘ్

పాకిస్థాన్​లోని లాహోర్​లో మేలా చిరాఘ్ వేడుక
పాకిస్థాన్​ లాహోర్​లో మేలా చిరాఘ్ వేడుక వైభవంగా జరిగింది. 16వ శతాబ్దపు సూఫీ సన్యాసి మాధోలాల్ హుస్సేన్​ను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో యాత్రికులు కులమతాలకు అతీతంగా హాజరయ్యారు.

ఎవరీ మాధోలాల్ హుస్సేన్​

క్రీ.శ 1538లో జన్మించిన మాధోలాల్ హుస్సేన్ అసలు పేరు షా హుస్సేన్. సూఫీ సన్యాసిగా విశేష ఆదరణ పొందిన ఈయన మాధో అనే హిందూ కుర్రాడిని ప్రేమించాడు. చనిపోయిన తర్వాత ఇద్దరిని బాఘ్​బాన్​పుర్​లోనే సమాధి చేశారు.

ఈ వేడుక ప్రత్యేకత ఏంటి?

మాధోలాల్​ హుస్సేన్​కు అతీత శక్తులున్నాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఏటా వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్​, సిక్కులు తమ మొక్కులు తీర్చుకుంటారు.

"నేను నా కూతురితో ఇక్కడకు వచ్చాను. మా పాప చిన్నప్పటి నుంచి సరిగ్గా నడవలేదు. ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంది. మా పాప త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాను. మాధోలాల్ హుస్సేన్​పై నాకు పూర్తి నమ్మకముంది. ఆయన నా ప్రార్థనలు మన్నిస్తాడు" -రఖాయా భట్, భక్తురాలు

తూర్పు లాహోర్​లోని బాఘ్​బాన్​ఫూర్​లో పెద్ద మంటను మండించి మేలా చిరాఘ్​ పండుగను ఉత్సవంలా జరుపుతారు. మార్చి 30 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుక జరిగింది.

ABOUT THE AUTHOR

...view details