కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న రోగులు, అనుమానితులతో చైనాలో వైద్యులు, వైద్య సిబ్బందికి ఊపిరాడడం లేదు. రోజంతా పనిచేస్తున్నా రోగులు తగ్గకపోవడం వల్ల కొందరు వైద్యులు కనీసం లఘుశంక తీర్చుకునేందుకూ వెళ్లలేకపోతున్నారు. డైపర్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. మరికొందరైతే మూత్రం రాకుండా సాధ్యమైనంత తక్కువ నీరు తాగుతున్నారు.
మాస్కులు, ఇతర సురక్షిత పరికరాల కొరతతో పలువురు వైద్యులూ కొవిడ్-19 (కరోనా కొత్త వైరస్) బారిన పడుతున్నారు. అనారోగ్యం బారినపడ్డ తమద్వారా మరికొందరికి వైరస్ సోకుతుందని తెలిసినా అలాగే సేవలందించాల్సి రావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.