ఎవరస్ట్ ఎత్తు పునస్సమీక్షకు చైనా బృందం శిఖరం పైకి చేరుకుంది. టిబెట్ మీదుగా 8,800 కి.మీ ఎత్తైన పర్వతంపైకి వెళ్లింది. ఎవరెస్టు ఎత్తు 8,844.43 అని చైనా పేర్కొంటోంది. ఇది నేపాల్ చెబుతున్న దాని కంటే నాలుగు మీటర్లు తక్కువ అని వాదిస్తోంది చైనా.
ఎవరెస్ట్ ఎత్తు పునస్సమీక్ష కోసం చైనా, నేపాల్ గతేడాది సంయుక్త కార్యాచరణను చేపట్టాయి. అయితే నేపాల్ లెక్కలతో విభేదించిన చైనా మే 1న కొత్త సర్వే ప్రారంభించింది. ఇందులో భాగంగానే చైనా సర్వే బృంద సభ్యులు ఎవరెస్టు శిఖరంపైకి చేరుకున్నారు. మంచు, భీకర గాలులు సహా ప్రతికూల వాతావరణం మధ్య ఎవరెస్టు ఎత్తును కొలిచే పనిని ప్రారంభించారు.
ఇదీ నేపథ్యం...
ఎవరెస్ట్ ఎత్తును ప్రప్రథమంగా భారత సర్వే విభాగం 1954లో కొలిచి.. 8848 మీటర్లుగా తేల్చింది. అనంతర కాలంలో చైనాకు చెందిన సర్వే బృందం 1975లో పర్వతాన్ని కొలిచి 8,848.13 మీటర్లుగా తేల్చింది. 2005లోనూ సర్వే చేపట్టిన చైనా ఎవరెస్ట్ ఎత్తును 8,844.43 గా ప్రకటించింది. అయితే 1954 నాటి భారత గణాంకాలనే ఇప్పటివరకు ప్రామాణికంగా భావిస్తున్నారు. కానీ 2015 నాటి భూకంపం కారణంగా ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2017లో ఓ ప్రత్యేక బృందాన్ని ఎవరెస్ట్ ఎత్తు కొలిచేందుకు ఏర్పాటు చేసింది నేపాల్. అనంతరం 2019 చివర్లో చైనాతో కలిసి సంయుక్తంగా గణాంక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఎవరెస్ట్ ఎత్తు పునస్సమీక్షకు చైనా బృందం ఇదీ చూడండి:ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గిందా? త్వరలో ప్రకటన!